కర్ణాటకలోని కొప్పల్ జిల్లా కరడకిలో మహ్మద్ కుట్టి బేకరీ నడుపుతున్నాడు. ఆ ప్రాంతానికి చెందిన 6 ఏళ్ల బాలిక తరచుగా కేకులు కొనడానికి బేకరీకి వస్తుంది. ఆ అమ్మాయితో మాట్లాడటం అలవాటు చేసుకున్న మహ్మద్ కుట్టి, కేక్ కొనడానికి వచ్చిన తర్వాత, చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడు.
దీంతో ఆ బాలిక భయపడినప్పటికీ, ధైర్యం చేసుకుని ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు మహమ్మద్ కుట్టి బేకరీని ముట్టడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలిక తల్లిదండ్రుల నుండి ఫిర్యాదును స్వీకరించి, దాని ఆధారంగా, పోక్సో చట్టం కింద మహమ్మద్ కుట్టిని అరెస్టు చేశారు.