దక్షిణ కర్నాటక రాష్ట్రంలో ఓ నేపాలీ మహిళ అత్యాచారం, హత్య కేసులో సరికొత్త కోణం వెలుగు చూసింది. తన ఊరివాడే అని దగ్గరకు చేరదీసిన మహిళపై ఓ ఎలక్ట్రీషియన్ అత్యాచారం చేసి.. తలపై బండరాయితో కొట్టి చంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
సౌత్ కర్నాటకలోని బనశంకరి, సర్జాపురలో నేపాల్‌కు చెందిన పవిత్ర (20) అనే మహిళ తన భర్తతో కలిసి నివశిస్తోంది. ఈమెకు నేపాల్‌కు చెందిన కరణ్ తిలక్ అనే యువకుడితో రెండేళ్లక్రితం పరిచయమైంది. ఇద్దరూ నేపాల్ దేశస్థులు కావడంతో పవిత్ర ఇంటికి కరణ్ వచ్చి వెళ్తూవుండేవాడు.