ప్రేమ పిచ్చి ముదిరింది. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందన్నట్లుగా ప్రేమ ముదిరి మూఢుడిగా మారిపోయాడతడు. ప్రేమికురాలని పొందాలంటే అమ్మవారికి తన నాలుక, మర్మాంగాన్ని సమర్పించుకుంటే దక్కుతుందన్న నమ్మకంతో ఆ పని చేసేశాడు. మరి అతను అనుకున్నది నెరవేరిందా...? వివరాలు చూస్తే... ఒరిస్సాకు చెందిన బిజు కుమార్ అనే యువకుడు తమ సొంత గ్రామంలో ఓ యువతిని ప్రేమించాడు. బిజు కుమార్ ప్రేమను సదరు యువతి తిరస్కరించింద. దానితో దేవదాసులా మద్యానికి బానిసైపోయాడు. '
ప్రేమ ఫలించి ప్రియురాలు దక్కాలంటే నాలుక, మర్మాంగాన్ని అమ్మవారికి సమర్పిస్తే అనుకున్నది నెరవేరుతుందని చెప్పారు. తద్వారా ప్రియురాలు దక్కుందని చెప్పడమే కాకుండా వశీకరణ విద్య కూడా వచ్చేస్తుందని చెప్పారు. దాంతో ప్రియురాలి కోసం చాకు తీసుకుని తన నాలుకను, మర్మాంగాన్ని కోసేసుకున్నాడు.
ఐతే నాలుక, మర్మాంగం కోసేసుకున్న తర్వాత శక్తులు కాదు కానీ ఒంట్లో శక్తంతా పోతుండటంతో భయమేసి తన బంధువులకు తనను ఎవరో కిడ్నాప్ చేసి నాలుక, మర్మాంగం కోశారంటూ విషయం చెప్పాడు. అతడిని ఆసుపత్రిలో చేర్పించిన సదరు బంధువులు విషయాన్ని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఐతే పోలీసు దర్యాప్తులో ఎలాంటి క్లూ లభించకపోవడంతో బిజు వద్దనే పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఏం జరిగిందో చెప్పకపోతే... తమదైన శైలిలో దర్యాప్తు సాగుతుందని చెప్పడంతో నిజాన్ని చెప్పేశాడు బిజు. తను ప్రేమించిన అమ్మాయిని వశం చేసుకునేందుకే ఇలా నాలుక, మర్మాంగం కోసేసుకున్నట్లు అంగీకరించాడు.