మహిళ ప్రైవేట్ భాగంలో బాటిల్ చొప్పించి గ్యాంగ్ రేప్, వీడియో తీసి షేర్

గురువారం, 8 జులై 2021 (18:35 IST)
బంగ్లాదేశ్‌కు చెందిన మహిళపై దారుణమైన సామూహిక అత్యాచారం, హింస కేసుకు సంబంధించి 12 మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు, వారిలో పదకొండు మంది బంగ్లాదేశ్ పౌరులు వున్నారు.
 
కేవలం ఐదు వారాల స్వల్ప వ్యవధిలో దర్యాప్తు పూర్తయిందని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ గురువారం ట్వీట్ చేశారు. కేసు చార్జిషీట్ కూడా కోర్టుకు సమర్పించబడిందని తెలిపారు. కేసు త్వరితగతిన చేసిన దర్యాప్తు బృందాన్ని ప్రశంసించిన ఆయన, జట్టుకు లక్ష రివార్డు మంజూరు చేసినట్లు తెలిపారు.
 

A reward of ₹1 Lakh has been sanctioned to the team for their remarkable work. (3/3)

— Kamal Pant, IPS (@CPBlr) July 8, 2021
ఈ ఏడాది మే నెలలో మహిళపై లైంగిక దాడి జరిగింది. మహిళపై దాడి చేసిన కలత పెట్టే వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసారు కామాంధులు. ఇందులో నిందితుడు మహిళ ప్రైవేట్ భాగాలలో ఒక బాటిల్‌ను కూడా చొప్పించాడు. తరువాత 22 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది.
 
అత్యాచారం తర్వాత ప్రాణాలతో బయటపడిన ఆమెను మూడేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆమెను దేశంలో అస్సాం, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటకల్లో తిప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను ముఠా బలవంతంగా వ్యభిచారం చేయించినట్లు తెలిపింది. ఆర్థిక వివాదం కారణంగా నిందితులు ఆమెను హింసించి, సామూహిక అత్యాచారం చేశారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు