తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ... అన్నాడీఎంకే పార్టీని చీల్చేసింది. అమ్మ మరణానికి తర్వాత తమిళనాట చిన్నమ్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదే తరహాలోనే శశికళ జైలులో ఓవరాక్షన్ చేసిందని ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ వివరాలు సమాచార చట్టం ప్రకారం.. బహిర్గతమైనాయి.
బెంగళూరులో జైలులో శశికళ ప్రత్యేక సదుపాయాలు కావాలని విన్నవించుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్, మంచం, ఇంటి భోజనం కావాలని కోరారు. అయితే అందుకు అనుమతి లభించలేదు. ఇంకా రాజకీయ నేత కావడంతో కార్యకర్తలు తనను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని శశికళ పట్టుబట్టారు. జైలు నిబంధనల ప్రకారం ఒక నెలకు ఇద్దరు విజిటర్స్ మాత్రమే కలిసేందుకు అనుమతి ఉంటుంది.
కానీ శశికళ ఈ నిబంధనను ఉల్లంఘించారు. 31 రోజుల్లో ఆమెను 19 మంది జైలులో కలిశారు. అందులో శశికళ భర్త నటరాజన్ చిన్నమ్మకు కలిసేందుకు పలుమార్లు జైలుకెళ్లారు. ఇదేవిధంగా దినకరన్, చిన్నమ్మ బంధువులు చిన్నమ్మను జైలులో కలిశారు.