తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఈయన భార్య తొమ్మిదేళ్ళ క్రితం చనిపోయింది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉండగా, కుమార్తె వయసు 15, కుమారుడు వయసు 9 యేళ్లు.
అయితే, భార్య చనిపోయిన తర్వాత పిల్లలతో కలసి అతడు మీకో లేఅవుట్‌లో నివసిస్తూ వచ్చాడు. అయితే, పిల్లలకు చదువును ఇంట్లోనే ఓపెన్ స్కూలు విధానంలో చెప్పించసాగాడు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కేసు నమోదు చేసి బాలికను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో తండ్రి తనపై కత్తెరతో దాడిచేయబోతుంటే.. తాను ఎదురుదాడికి దిగానని, ఆ పెనుగులాటలో తండ్రికి తీవ్రగాయాలై చనిపోయాడని కూతురు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.