తాత కాబోతున్న కోలీవుడ్ స్టార్ హీరో!!

మంగళవారం, 21 జులై 2020 (19:40 IST)
కోలీవుడ్ స్టార్ హీరోల్లో విక్రమ్ ఒకరు. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌తో పాటు.. సౌత్‌లోనే కాకుండా, భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే పలు విభిన్నమైన క్యారక్టర్లను పోషించి ప్రేక్షకులను అలరించిన విక్రమ్... ఇప్పటికే తన కుమారుడు ధ్రువ్‌ను కూడా వెండితెరకు హీరోగా పరిచయం చేశాడు. 
 
తాజాగా ఆయనకు మరో ప్రమోషన్ రాబోతోంది. త్వరలోనే విక్రమ్ తాత కాబోతున్నాడు. తమ ఇంట్లో అడుగుపెట్టబోతున్న కొత్త తరం కోసం ఇంటిల్లిపాది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విక్రమ్, శైలజ దంపతులకు ధ్రువ్‌తో పాటు అక్షిత అనే కుమార్తె ఉంది. 
 
ఈమెకు గత 2017లో అక్షితకు రంజిత్‌తో వివాహం జరిగింది. త్వరలోనే అక్షిత పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో, తమకు అత్యంత సన్నిహితులైన కొద్ది మంది సమక్షంలో సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు విక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. 
 
కాగా రంజిత్ కుటుంబం డీఎంకే మాజీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధికి సమీప బంధువులు కావడం గమనార్హం. కరుణానిధి జీవించి ఉన్న సమయంలోనే ఈ వివాహం జరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు