పంజాబ్ సీఎం చాంబర్‌లో ఆసక్తికర దృశ్యం... ఆ ఇద్దరి ఫోటోలే...

బుధవారం, 16 మార్చి 2022 (20:10 IST)
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ సింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్  సింగ్ స్వగ్రామం ఖత్కర్ కలాన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆ తర్వాత నేరుగా పంజాబ్ సివిల్ సెక్రటేరియట్‌కు చేరుకున్నారు. సచివాలయంలోని సీఎం చాంబరులోకి ప్రవేశించిన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 
 
అయితే, సీఎం చాంబర్‌లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటోలతో పాటు ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటోలు ఉంటాయి. కానీ, ఈ సంప్రదాయానికి పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి స్వస్తి పలికారు. 
 
తన చాంబరులో కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫోటోలను మాత్రమే ఉంచారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయన అప్ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా తన కార్యాలయంలో కేవలం భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలు మాత్రమే ఉంటాయని ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగానే ఆయన తన కార్యాలయంలో వీరిద్దరి ఫోటోలు మినహా మరే ఫోటోను కూడా భగవంత్ మాన్ సింగ్ అనుమతించకపోవడం గమనార్హం. 

 

Bhagwant Mann assumes office as Chief Minister of Punjab at Punjab Civil Secretariat in Chandigarh pic.twitter.com/hg5trwOE46

— ANI (@ANI) March 16, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు