అల్ట్రాసౌండ్ మాటను వెకిలి చేష్టలు... టెక్నీషియన్‌కు దేహశుద్ధి

శనివారం, 22 జూన్ 2019 (12:40 IST)
ఓ ల్యాబ్ టెక్నీషియన్ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. అల్ట్రాసౌండ్ మాటున 19 బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన బంధువులకు చెప్పడంతో వారంతా కలిసి ఆ ల్యాబ్ టెక్నీషియన్‌కు దేహశుద్ధి చేశారు. బీహార్ రాష్ట్రంలోని భగల్పూరు ఆస్పత్రిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, భగల్పూర్‌లోని ఆసుపత్రి రోడ్డులోగల బిరజీ డయాగ్నోస్టిక్ సెంటర్‌ ఉంది. ఇక్కడకు 19 యేళ్ల వయసున్న ఓ బాలిక అల్ట్రాసౌండ్ స్కాన్ కోసం వచ్చింది. దీంతో అల్ట్రాసౌండ్ స్కాన్ తీసేందుకు గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసి వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి గట్టగా కేకలు వేయడంతో తనను మన్నించమని ప్రాధేయపడ్డారు. అయితే, ఆ యనవతి మాత్రం గదిలో తనకు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. 
 
దీంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు మూకుమ్ముడిగా ఆ సెంటర్‌పై దాడిచేశారు. డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఉన్న వస్తువులను చిందరవందర చేశారు. సీసీటీవీ కెమెరాను కూడా ధ్వంసం చేశారు. దీనిని గమనించిన సెంటర్ సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని టెక్నీషియన్ అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు