గ్యాంబ్లింగ్‌లో సర్వం కోల్పోయి చివరికి కట్టుకున్న భార్యను కూడా ఓ భర్త తాకట్టు పెట్టాడు. తన స్నేహితులతో గడపాలని ఒత్తిడి చేశాడు. నిరాకరించడంతో యాసిడ్ పోసి చిత్ర హింసలకు గురి చేశాడు. బీహార్‌లోని భగల్పూర్లో ఈ అమానవీయ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. తనపై యాసిడ్ పోసి దాడి చేశాడని భర్తపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
వైద్య పరీక్షల కోసం మహిళను ఆసుపత్రిలో చేర్పించామని భగల్పూర్ ఎస్ఎస్పీ ఆశిష్ భార్తీ చెప్పారు. భర్త బలవంతంతో రెండు, మూడుసార్లు స్నేహితులతో గడిపిన మహిళ ఆ తర్వాత తీవ్రంగా నిరాకరించింది. దీంతో ఆమెపై భర్త యాసిడ్‌తో దాడి చేశాడు. బాధితురాలు తీవ్ర గాయాలతో ఉందని, ఈ విషయాన్ని దాచేందుకు నిందితులు ఆమెను మొజాహిద్పూర్లోని ఓ ఇంట్లో దాచి ఉంచారని పోలీసులు తెలిపారు.
బెట్లో ఓడిపోయానని, అందులో భాగంగానే గెలిచిన వారికి తన భార్యను ఓ నెల పాటు అప్పజెప్పేందుకు సిద్ధమయ్యాయని నిందుతుడైన భర్త చెప్పాడని పోలీసులు వెల్లడించారు. అయితే రెండు, మూడు సార్ల తర్వాత వెళ్లేందుకు బాధితురాలు తీవ్రంగా నిరాకరించింది. భర్త చెర నుంచి తప్పించుకొని బాధితురాలు లోధిపూర్లోని తండ్రి ఇంటికి చేరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.