బీహార్‌లో ముష్కరుల హల్చల్ - మోటారు బైకుపై వచ్చిన ప్రజలపై కాల్పులు (Video)

బుధవారం, 14 సెప్టెంబరు 2022 (13:13 IST)
బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లాలో ఇద్దరు సైకోలు బీభత్సం సృష్టించారు. మోటారుబైకుపై బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ కాల్పుల ఘటనతో బీహార్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ముష్కరుల కోసం వేట మొదలుపెట్టారు. 
 
బీహార్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో బెగుసరాయ్ పట్టణంలోని మల్హిపూర్ చౌక్ వద్దకు ఇద్దరు దుండగులు ఒక మోటార్ బైకుపై వచ్చారు. ఆ ప్రాంతంలో దుకాణాలు అధికంగా ఉండటంతో ప్రజలతో బాగాగ రద్దీగా ఉంది. అంతే ఒక్కసారిగా గుంపులుగా ఉన్న ప్రజలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపారు. 
 
అక్కడ నుంచి బరౌనీ థర్మల్ చౌక్, బరౌనీ, తేఘ్రా, బచ్వారా, రాజేంద్ర వంతెన వద్దకు కూడా ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చందన్ కుమార్ అనే 30 యేళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని బెగుసరాయ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసిన బీహార్ పోలీసులు.. ఇద్దరు ముష్కరుల కోసం గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఈ కాల్పుల ఘటన జరిగినప్పటికీ బుధవారం మధ్యాహ్నం వరకు దుండగులను పోలీసులు గుర్తించలేదు. 

 

Mass shooting being reported in #Begusarai, one killed and 8 people injured. pic.twitter.com/KVsc5gyUUh

— Nikhil Choudhary (@NikhilCh_) September 13, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు