బీహార్ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో రైడ్.. డబ్బే డబ్బు.. వీడియో

శనివారం, 27 ఆగస్టు 2022 (22:22 IST)
బీహార్ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన దాడుల్లో ఏకంగా రూ.4 కోట్ల నగదు లభ్యమైంది. ప్రజా పనుల శాఖ కిషన్‌గంజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్ రాయ్‌కు చెందిన పట్నా, కిషన్‌గంజ్‌లో పలు ప్రదేశాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అధికారుల దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. 
 
అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. సంజయ్ కుమార్ రాయ్‌‌కు చెందిన కిషన్ గంజ్ ఇంటికి అధికారులు వెళ్లినప్పుడు.. కొంత డబ్బును అతని కింద పనిచేసే ఒక జూనియర్ ఇంజనీర్, క్యాషియర్ వద్ద ఉంచినట్టు తెలిసింది. 
 
దాంతో రాయ్ అనుచరుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. కిషన్‌గంజ్‌లోని క్యాషియర్ ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.3 కోట్లకుపైగా డబ్బు, బంగారం దొరికింది. 

#WATCH | Bihar: Cash counting is underway at the residence of Sanjay Kumar Rai, Executive Engineer of the Kishanganj Division of Rural Works Department in Patna.

Vigilance department has conducted raids at 3-4 premises of Sanjay Kumar Rai in Bihar pic.twitter.com/RwW04tNs4I

— ANI (@ANI) August 27, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు