నాలుగోసారి పెళ్లి చేసుకోవాలనుకుంది.. అడ్డుగా వున్నాడని నాలుగేళ్ల బిడ్డను..?

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (16:52 IST)
మాతృత్వానికి ఆ తల్లి మచ్చ తెచ్చింది. నాలుగో వివాహానికి అడ్డంకిగా వున్నాడని నాలుగేళ్ల కుమారుడిని ఓ కిరాతక తల్లి హత్య చేసిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ జిల్లా, పాట్నాకు సమీపంలో హసన్‌పూర్‌కు చెందిన ధర్మశీలా దేవి (23), చౌదరి (28)లకు షాజన్ కుమార్ అనే నాలుగేళ్ల కుమారుడు వున్నాడు. అయితే ఈ బిడ్డకు మాటలు రావు. వినలేడు కూడా. 
 
వివాహమైన ఏడాదికే ధర్మశీలా దేవి భర్త నుంచి విడిపోయింది. తన కుమారుడితో వేరొక ప్రాంతంలో నివసిస్తోంది. రెండో వివాహం కూడా చేసుకుంది. అయితే రెండో భర్త అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ పై కొన్ని నెలల తర్వాత మూడో పెళ్లి కూడా చేసుకుంది. అతడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో నాలుగో పెళ్లి చేసుకోవాలనుకుంది ధర్మశీల.
 
కానీ తనకు అడ్డుగా నాలుగేళ్ల కుమారుడు వున్నాడని తెలుసుకున్న ఆమె.. అతడిని హతమార్చింది. నాలుగేళ్ల కుమారుడిని నీటిలో మునిగేలా చేసి హతమార్చింది. అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో తాను నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు ధర్మశీలా దేవిని అరెస్ట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు