ఓ సుప్రసిద్ధ ఆలయంలో హిందూ సంప్రదాయాలు మంటగలిసిపోయాయి. సంప్రదాయానికి అనుగుణంగా ఆలయాల్లో పూజలు చేస్తుంటారు. పూజలో పాల్గొనే వారు సంప్రదాయ దుస్తుల్లో కనిపించాలని ఆలయ నిర్వాహకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆలయాల్లో నైటీలు, లుంగీలు ధరించకూడదని అనేక ఆలయాల్లో నిషేధం విధించారు.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఉంది. ఈ ఆలయంలో విదేశీ మోడల్‌తో బికినీలో ఫోటో షూట్ చెయ్యడానికి సిద్దం అయ్యారు. విదేశీ మోడల్ చుట్టూ కొందరు మహిళలు హిందూ సాంప్రదాయం ప్రకారం చీరలు కట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ సమయంలో విదేశీ మోడల్ బికినీ వేసుకుని అటూ ఇటూ తిరుగుతున్న సమయంలో ఫోటో షూట్ చేశారు. దీనిపై ఆలయ నిర్వాహకులపై స్థానికులు ఫైర్ అవుతున్నారు.