నరేంద్ర మోడీ ఓ కసాయి .. నిప్పులు చెరిగిన పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో

మంగళవారం, 18 అక్టోబరు 2016 (10:32 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ కసాయి అని పీపీవీ ఛైర్మన్ బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన మోడీని ఉగ్రవాదిగా అభివర్ణించారు. 
 
గుజరాత్, కశ్మీర్‌ల పాలిట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కసాయి. కాశ్మీర్‌ లోయలో జరుగుతున్న అత్యాచారాలు బయటపడకుండా ఉండేందుకే పాక్‌పై మోడీ బురద జల్లుతున్నారు. కాశ్మీరీలు తమ హక్కులను కూడా సాధించుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారు. పాకిస్థాన్‌లోని నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం, వారి విధానాలవల్లే పాక్‌ మరింత బలహీన పడుతోందన్నారు. 
 
నవాజ్ షరీఫ్ ప్రభుత్వ విధానాల వల్లే పాక్ బలహీనపడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు తానుంచిన నాలుగు డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోకుంటే డిసెంబరు 27 నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతానని నవాజ్ ప్రభుత్వాన్ని బిలావల్ హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి