మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ విజృంభణ - ఆందోళనలో అధికారులు

ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (13:00 IST)
దేశం కరోనా కోరల్లో నుంచి ఇపుడిపుడే బయటపడుతున్నాయి. ఇపుడు బర్డ్ ఫ్లూ రూపంలో మరో గండం పొంచివుంది. దేశంలో చాపకింద నీరులా బర్డ్ ఫ్లూ విస్తరిస్తుంది. మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది. దీంతో ఆ రాష్ట్ర వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
తొలుత థానే జిల్లాలోని వెహ్లోలి గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫారంలో 100కు పైగా కోళ్లను మృత్యువాతపడినట్టు గుర్తించిన స్థానిక అధికారులు, విషయాన్నీ జిల్లా పశువైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఈ రెండు జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ఫ్లు‌ఎంజా వైరస్ వ్యాప్తి అధికారంగా ఉన్నట్లు తేల్చారు. ఈ క్రమంలో మిగతా ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నట్టు పాల్‌ఘర్ జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కాంబ్లే  వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు