మహారాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. కరోనా టెస్టు కోసం శాంపిల్స్ సేకరణ కోసం ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఒక మహిళ ప్రైవేట్ భాగంలో చేయిపెట్టి స్వాబ్ సేకరించి, అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆ యువతి తన సోదరుడికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర, అమరావతిలోని ఓ మాల్‌లో పని చేసే ఉద్యోగుల్లో కొందరికి కరోనా వైరస్ సోకింది. దీంతో స్థానిక వైద్యాధికారులు మాల్‌లోని ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించారు. దీంతో ట్రామా కేర్ సెంటర్‌కు చెందిన అల్కేష్ దేశ్‌ముఖ్ అనే ఒక ల్యాబ్ టెక్నీషియన్ మాల్ ఉద్యోగులందరి వద్జ శాంపిల్స్ సేకరించారు. వీరిలో ఒక యువతి వద్ద అసభ్యంగా ప్రవర్తించాడు.
తొలుత ముక్కు, గొంతు ద్వారా స్వాబ్ సేకరించిన తర్వాత మిగిలిన టెస్టుల కోసం ల్యాప్‌కి పిలిపించాడు. అక్కడ ఆమెను పడుకోబెట్టి.. ఆమె ప్రైవేట్ భాగం నుంచి స్వాబ్ సేకరించాలని నమ్మించి యోని భాగంలో చేయి పెట్టి స్వాబ్ సేకరించాడు.