కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో ఒక్కసారిగా బలం పెరిగింది. కీలక బిల్లుల ఆమోదం కోసం భాగస్వామ్య పార్టీలతో పాటు విపక్షాల మద్దతుపై ఆధారపడుతూ వచ్చేది. అయితే, ఇపుడు ఆ పార్టీ బలం ఒక్కసారిగా వందకు చేరింది. 1990 తర్వాత వంద మార్కును చేరిన తొలి పార్టీగా భారతీయ జనతా పార్టీ గుర్తింపు పొందింది.
ఇటీవల జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అస్సోం, త్రిపుర, నాగాలాండ్, హిమాచల ప్రదేశ్‌లకు చెందిన ఒక్కో సీటును బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే, పంజాబ్ కోటాలో ఐదు సీట్లకు ఎన్నికలు జరుగగా తన ఖాతాలోని సీటును బీజేపీ కోల్పోయింది.