ఉత్తరప్రదేశ్‌లో దారుణం - ఈవెనింగ్ వాక్‌కు వెళ్లిన బీజేపీ కాల్చివేత

శుక్రవారం, 11 ఆగస్టు 2023 (13:01 IST)
బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఈవెనింగ్ వాక్‌కు వెళ్లిన బీజేపీ నేతపై కొందరు దుండగులు నడి రోడ్డుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ నేతను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. రాజకీయ కక్షలే ఈ కాల్పులకు కారణంగా ఉంది. శుక్రవారం  వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
అనుజ్ చౌదరి (30) అనే వ్యక్తి మొరాబాద్ పట్టణ బీజేపీ నేతగా ఉన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన ఆయన మరొకరితో నడిచి వెళుతున్నారు. బైక్‌పై వచ్చిన దుండగులు వెనుక నుంచి వచ్చి కాల్పులు జరిపారు. ఈ కాల్పులతో ఆయన కుప్పకూలిపోయారు. ఆ తర్వాత బైక్‌పై పారిపోయారు. అనుజ్ చౌదరి నివసించే అపార్ట్‌మెంట్ సమీపంలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. 
 
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అనుజ్ చౌదరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తూ పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు రాజకీయ పరమైన కక్షలో ఉండివుంటాయని జిల్లా ఎస్పీ మీనా తెలిపారు. 
 
కాగా, గత పదేళ్లుగా ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువైపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు పోలీసులు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రౌడీ ముఠాలు మాత్రం అపుడపుడూ చెలరేగిపోతూనే ఉన్నారు. 


 

⚠️ Warning: Disturbing visuals⚠️

BJP leader Anuj Chaudhary shot dead in Moradabad.

He was shot dead while he was on evening walk with his brother.

Video Credit: @Shariq_mbdpic.twitter.com/yHnrHblDTO

— Siddharth (@SidKeVichaar) August 10, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు