బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న మూత్ర విసర్జన... తప్పుకున్న నేత

సోమవారం, 10 జులై 2023 (14:03 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటన భారతీయ జనతా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా కీలక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు నిరసనగా సిధ్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వివేక్ కోల్ పార్టీ నుంచి తప్పుకున్నారు.
 
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన రాజీనామా లేఖను జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మకు ఈమెయిల్ చేశారు. రాజీనామా గురించి పునరాలోచించమని పార్టీ కోరిందని, అయితే ఇదే తన తుది నిర్ణయమని ఆయన స్పష్టంచేశారు.
 
సిధ్ ఎమ్మెల్యే కేదార్‌నాథ్ శుక్లా చేష్టలతో రెండేళ్లుగా విసిగిపోయానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో గిరిజనుల భూమి ఆక్రమణలు, వారిపై దాడులు వంటివి తనను కలచివేశాయన్నారు. 
 
ఇప్పుడాయన ప్రతినిధిగా చెప్పుకుంటున్న పర్వేశ్ శుక్లా గిరిజనుడిపై మూత్ర విసర్జన చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో చుర్హత్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరపున పోటీ చేసిన వివేక్ కోల్ ఓటమి పాలయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు