ఐశ్వర్యరాయ్‌పైనే కాదు రాహుల్ గాంధీ కూడా అమితాబ్ బచ్చన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 21న ఒక ప్రసంగంలో రాహుల్ గాంధీ, అమితాబ్, ఐశ్వర్యపై వివాదాస్పద కామెంట్లు చేశారు.
అయోధ్య రామమందిర ప్రతిష్ఠా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ అమితాబ్, ఐశ్వర్య వంటి వారిని ఆహ్వానించారని, అయితే ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ), పేదలను ఆహ్వానించలేదని రాహుల్ గాంధీ అన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం పేరుతో ఐశ్వర్యారాయ్, అమితాబ్ బచ్చన్‌లను టార్గెట్ చేసిన రాహుల్ గాంధీని ట్విట్టర్‌లో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. రాహుల్ గాంధీతో పాటు ఐశ్వర్యరాయ్ అత్త, రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.