మతతత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా సమాజాన్ని విభజించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమాజాన్ని విభజించడానికి మత కల్లోలాలను రెచ్చగొడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. అందుకే దేశ రాజధాని మూడు రోజులు అట్టుడికిందని ఆరోపించారు.
‘‘కొన్ని రోజులుగా ఢిల్లీ అట్టుడుకుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభం పొందింది. మతతత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా సమాజాన్ని విభజించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది’’ అని శరద్ పవార్ ఘాటుగా విమర్శించారు.
ఢిల్లీ అల్లర్లకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కారణమని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల కారణంగా మోదీ, షా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి, సమాజాన్ని విభజించాలని చూశారని పవార్ ఆరోపించారు.