బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ఖరారు చేసేందుకు పార్టీ సంస్థాగత ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఖరారు చేసే అవకాశం వుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు తెలంగాణ సహా పలు రాష్ట్ర శాఖల అధ్యక్షుల పదవీకాలాన్ని బీజేపీ పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రకారం మార్పులు జరగనున్నాయి.