పెళ్లి వైభవంగా ముగిసింది. కానీ అప్పగింతలే ఆ వధువుకు ప్రాణాల మీదకు తెచ్చింది. పెళ్ళి చేసుకున్న అనంతరం వరుడు కుటుంబానికి వధువును తల్లిదండ్రులు అప్పగిస్తారు. ఆ సమయంలో వధువు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతుంటారు. తమ కుమార్తెకు ఎలాంటి కష్టం రానీయకుండా చూసుకోవాలని, ఏదైనా తప్పులు జరిగితే సర్దుకు పోవాలంటూ.. అప్పగిస్తుంటారు.
ఇక సున్నితమైన మనస్కులు వారైతే.. ఏడుస్తూ…కుప్పకూలిపోతుంటారు. ఇలాగే ఓ ఘటన ఒకటి చోటుచేసుకుంది. అత్తారింటికి వెళ్లే సమయంలో.. అతిగా ఏడుస్తూ.. వధువు మృతి చెందింది. ఈ ఘటన ఒడిసా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోనేపూర్ జిల్లాలో గుప్తేశ్వరి సాహూకు ఓ యువకుడి తో వివాహం జరిగింది. మరుసటి రోజు..అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
నవ వధువుకు వీడ్కోలు పలుకుతుండగా ఒక్కసారిగా ఆమె సృహ కోల్పోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు జరపగా..ఆమె చనిపోయిందని నిర్ధారించారు. అప్పగింతల్లో అతిగా ఏడ్వడం వల్ల గుండెపోటు వచ్చిందని, దీంతో వధువు చనిపోయినట్లు పేర్కొన్నారు.