ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ నగల దుకాణంలో దొంగలు చొరబడి దుకాణంలోని బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డారు. ఆగ్రాకు సమీపంలో ఈ చోరీ జరుగగా, ఈ చోరీ వ్యవహారమంతా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
అయితే, తమ ముఖాలు సీసీ టీవీ కెమెరాల్లో నమోదు కాకుండా ఉండేందుకు ముఖానికి వస్త్రాన్ని ధరించారు. దుకాణంలోకి ప్రవేశించిన వారు... ఒక్కో నగను తమ బ్యాగుల్లో వేసుకోవడం నిశితంగా చూడొచ్చు. కాగా, ఈ వీడియో ఆధారంగా వారిని పోలీసులు గాలిస్తున్నారు.