సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు, మెడికల్ షాపుల దగ్గర కరోనా వ్యాప్తికి చెక్

బుధవారం, 17 జూన్ 2020 (08:36 IST)
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ 5.0కి సడలింపులు ఇవ్వడంతో కోవిడ్-19 వ్యాప్తి తీవ్రమవుతూనే ఉంది. మనకు నిత్యవసరాలు, అత్యవసరాలు, మందుల వంటివి తప్పనిసరిగా కావాలి. వీటికోసం మనం ఇంటి నుంచి బయటకు వెళ్లి తీరాల్సిందే.

ఈ నేపథ్యంలో సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు, ఫార్మసీలు / మెడికల్ షాపులకు తరచూ వెళ్తూ ఉంటాం. అక్కడ మనకు అవసరమైనవన్నీ తెచ్చుకుంటాం. మనం తెచ్చుకున్న వస్తువులను ఎంతమంది తాకి ఉంటారో? ఎన్ని వస్తువులపై కరోనా ఉంటుందో మనకు తెలియదు. కరోనా ఉండదు అనుకోవడానికి లేదు.

కాబట్టి మనం తెచ్చుకున్న వస్తువులను ఇంట్లోకి తెచ్చాక తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, ఫార్మసీ / ఔషధశాలల యాజమాన్యాలు కూడా ఈ కింది మార్గదర్శకాలను పాటించాలి.  
 
•  సూపర్ మార్కెట్లు, మెడికల్ స్టోర్ లో పనిచేసే ఉద్యోగుల్లో కరోనా వైరస్ లేదా ఫ్లూ లాంటి లక్షణాలను ఉండవచ్చని అనుమానం వస్తే పనికి వెళ్ళకూడదు.
 
•  స్టోర్స్ లో రద్దీని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి లోపలికి వచ్చే వినియోగదారుల సంఖ్యను పర్యవేక్షిస్తూ, అది ఆ స్టోర్ గరిష్ట ఆక్యుపెన్సీ పరిమాణం బట్టి ఉండాలి. 
 
•  వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువుల పట్టికను ముందే తయారు చేసుకుని రావాలి. అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించాలి.  
 
•  ఒకవేల కస్టమర్‌లు వరుసలో వేచి ఉండాల్సి వస్తే బయటి ప్రదేశాలలో క్యులైన్లు ఏర్పాటు చేయాలి. వినియోగదారుల మధ్య దూరం కనీసం 2 మీటర్లు లేదా 6 అడుగులు ఉండాలి. ఇందుకోసం స్టోర్స్ బయట గుర్తులు ఏర్పాటు చేయాలి
 
•  పెద్ద పార్కింగ్ స్థలం ఉన్న దుకాణదారులు తమ కస్టమర్ల ఫోన్ నంబర్లను తీసుకుని టోకన్ పద్దతిని పాటిస్తూ కస్టమర్లకు ఒక సంఖ్యను కేటాయించాలి. వారి సమయం వచ్చినపుడు కాల్ లేదా టెక్స్ట్ మెసేజ్ (SMS) ద్వారా తెలియజేస్తే అప్పుడు సంబంధిత సమయంలో వారు షాపింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
 
సమాచారాన్ని తెలియజేయడానికి అక్కడ టోకన్ డిస్ప్లే చేయడం / స్పీకర్లలో అనౌన్స్ చేయడం వంటివి కూడా చేయవచ్చు.
 
• ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చి పికప్ (వీలైతే ఆరుబయట) లేదా హోమ్ డెలివరీకి వినియోగదారులను ప్రోత్సహించాలి.
 
•  స్టోర్ లో పనిచేసే ఉద్యోగులతోపాటు వీలైతే వినియోగదారులకు కూడా టెంపరేచర్ (ఉష్ణోగ్రత) టెస్ట్ లు చేయాలి. ఒక వ్యక్తి ఉష్ణోగ్రత అత్యధికంగా (101 F లేదా 38 డిగ్రీల టెంపరేచర్) వస్తే వారిని స్టోర్లోకి అనుమతించకూడదు.
 
• వినియోగదారులు మరియు ఉద్యోగులకు వైరస్ పై అవగాహన కల్పించడానికి, హెచ్చరించడానికి అవసరమైన సంకేతాలను సంబందిత స్టోర్ దగ్గర ఉంచాలి.  
 
• కస్టమర్ల రద్దీని తగ్గించడం కోసం స్టోర్ లోపల వన్-వే లూప్‌ను సూచించడానికి నేల గుర్తులు లేదా ఇతర దృశ్య వ్యవస్థను ఉపయోగించండి.
 
• స్టోర్లలో ప్రవేశ ద్వారాలు మరియు బయటకు వెళ్లే మార్గాల వద్ద తప్పకుండా హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. స్టోర్ లోపల వీలైనన్ని ఎక్కువ ప్రదేశాలలో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. స్టోర్ లో అవసరమైన వస్తువులు తాకడం, కొనుగోలు చేయాలి.  
 
• స్టోర్ లో పనిచేసే వారు బిల్లులు తీసుకునే సమయంలో కస్టమర్లు మధ్య గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
• బిల్లులు చేసేవారు చేతి గ్లౌజులు మరియు మాస్కులు ధరించడం చాలా అవసరం.
 
• స్టోర్ సిబ్బంది చేతి గ్లౌజులు ధరించినప్పుడు వారు తమ ముఖాన్ని తాకకుండా ఉండాలి. చేతి గ్లౌజులు క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి.
  
• స్టోర్ సిబ్బంది ప్రతి షిఫ్ట్ తరువాత వ్యక్తిగత శుభ్రతను పాటించడంతో పాటు స్టోర్ లోని అన్ని ప్రదేశాలు/ఉపరితలాలను పూర్తిగా శానిటైజ్ చేయాలి. 
 
•  క్యాషియర్లు మరియు బ్యాగర్లు చేతి గ్లౌజులు ధరించాలి. తరచుగా శానిటైజర్ వాడుతూ ఉండాలి.
 
•  వీలైనంత ఎక్కువగా ఆన్ లైన్ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలి. సాధ్యంకాని చోట నగదు చెల్లింపులను నివారించండి
 
•  నగదు చెల్లింపుల కోసం నెట్ ను వాడాలి. వినియోగదారులు చెల్లింపుల సమయంలో నగదును నేరుగా ఆ వలలో డబ్బు వేసే విధంగా చర్యలు తీసుకోవాలి. 
 
•  స్టోర్ నిర్వాహకులు జరిపే రోజువారీ సమావేశాలల్లోనూ భౌతిక దూరాన్నిపాటించాలి. సోర్ట్ శుభ్రతతోపాటు ఇతర జాగ్రత్తలను తమ ఉద్యోగులకు తెలియజేయాలి. 
 
•  కస్టమర్లు, స్టోర్స్ సిబ్బంది లేదా నిర్వాహకులు సమాజ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
 
జాగ్రత్తగా ఉంటే జనాభా లెక్కల్లో ఉంటాం..! కేర్లెస్ గా ఉంటే కరోనా లెక్కల్లో ఉంటాం..!!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు