తుపాకీ లైసెన్సులను అక్రమంగా విక్రయించిన కేసులో జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి షహీద్ ఇక్భాన్ చౌధురి నివాసంలో సీబీఐ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేశారు. అలాగే, ఢిల్లీతో సహా జమ్మూ కాశ్మీర్‌లోని 40 ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి సోదాలు చేపట్టారు.
కథువా, రేశాయ్, రాజోరీ ప్రాంతాల్లో డిప్యూటీ కమిషనరుగా పనిచేసినన షహీద్ ఇక్బాల్.. నకిలీ పేర్లతో ఇతర రాష్ట్రాలు, పలువురు వ్యక్తులకు లైసెన్సులు జారీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈయన గిరిజన వ్యవహారాల కార్యదర్శిగా కొనసాగుతున్నారు.