సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు.. బాలికలదే పైచేయి..

సెల్వి

సోమవారం, 13 మే 2024 (13:00 IST)
సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలను మే 13న (నేడు) విడుదలయ్యాయి. ఈ ఏడాది ఫలితాల్లో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. 91.52 శాతంకు పైగా అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా.. 85.12 శాతంకు పైగా అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డ్‌ వెల్లడించింది. 
 
1.16లక్షల మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని సీబీఎస్​ఈ తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు 12వ తరగతి పరీక్షలు జరిగాయి. విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు గత కొన్నేళ్లుగా మెరిట్‌ జాబితాలను వెల్లడించకూడదని నిర్ణయించింది. 
 
ఇకపోతే.. ఏడాదిలో రెండుసార్లు టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను నిర్వహించే అంశంపై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో వచ్చే నెలలోనే సంప్రదింపులు జరపనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు