బీర్ల కంపెనీలకు సీసీఐ దిమ్మతిరిగే షాక్: రూ.873 కోట్ల ఫైన్

శనివారం, 25 సెప్టెంబరు 2021 (11:44 IST)
బీర్ల కంపెనీలకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) దిమ్మతిరిగే షాకింగ్ ఇచ్చింది. మార్కెట్‌ నిబంధనలకు విరుద్దంగా ధరల పెంచుతున్న, సీసీఐ నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న బీర్ల కంపెనీలపై సీసీఐ శుక్రవారం కొరడా ఝుళిపించింది. 
 
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.873కోట్ల ఫైన్ వేసింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, కార్ల్స్‌బర్గ్ ఇండియా, ఆల్ ఇండియా బ్రూవర్స్ అసోసియేషన్‌లతో పాటు మరో 11 మందిపై ఏకంగా రూ.873 కోట్లకుపైగా జరిమానా విధించింది.
 
కాంపిటీషన్ లాను వ్యతిరేకిస్తూ.. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ సేల్, సప్లై విషయంలో ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీసహా పలు రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు, సరఫరాల్లో కూటమిగా ఏర్పడి మార్కెట్‌ స్వేచ్ఛను దెబ్బతీశారని పేర్కొంది సీసీఐ. పెనాల్టీని తగ్గిస్తూ.. బెనిఫిట్ ఇచ్చామని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు