తమిళనాడులో జల్లికట్టు పోటీల నిర్వహణకు కేంద్రం అనుమతి?

సోమవారం, 2 జనవరి 2017 (08:40 IST)
తమిళ సంప్రదాయ సాహస క్రీడగా గుర్తింపు పొందిన జల్లికట్టు పోటీలకు కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది అనమతి ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోది. ఇందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఈ అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని భావిస్తున్నారు. 
 
జయలలిత మృతి తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా నిలదొక్కుకోవాలన్నా... బలపడాలన్నా ఇదే తగిన మంచి తరుణమని వాళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకెతో స్నేహంగా ఉంటూనే మరోవైపు రాజకీయ మైలేజీని పొందేందుకు ఈ జల్లికట్టుకుమించిన ఉపాయమేమీ లేదని కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అలోచిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ జల్లికట్టు పోటీల్లో పశుహింసకు కారణమవుతున్న ఈ సంప్రదాయాన్ని ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి