అలా హనీట్రాప్‌లో మల్లికార్జున్ చిక్కుకున్నాడు. 6 నెలల పాటు విదేశీ ఐపీ అడ్రస్‌తో మల్లికార్జున్ తరచూ మాట్లాడటంతో నిఘా సంస్థలు దీన్ని గుర్తించాయి. చివరికి బాలాపూర్ పోలీసులు 2022 జులైలో అతడిని అరెస్టు చేశారు. అతడి ఫోన్ డేటాను సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో రీట్రీవ్ కూడా చేయించారు. చివరికి అతడు దేశ భద్రతకు సంబంధించి రహస్య సమాచారం పంపించినట్లు తేల్చారు.