1630లో పూణేలోని శివనేరిలో జన్మించాడు. ప్రధానంగా, భారతదేశంలోని ధైర్యవంతులైన, సాహసవీరులైన రాజుల్లో శివాజీ ఒకరు. శివాజీ జయంతిని మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. అతను ధైర్యం, పరిపాలన, పోరాట నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన వారు.
రాష్ట్ర వాసులు ఆయన జయంతిని ఎంతో ఉత్సాహంగా, గర్వంగా జరుపుకుంటారు. శివాజీ తన పాలనలో, మరాఠీ, సంస్కృతం వంటి ప్రాంతీయ భాషలకు మద్దతు ఇచ్చారు. అందువలన, భారతీయ చరిత్రకు ఆయన చేసిన సేవలు రాబోయే తరాలకు అతన్ని రోల్ మోడల్‌గా చేశాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు, మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఆదిత్య థాకరే, ఔరంగాబాద్ జిల్లా గార్డియన్ మంత్రి సుభాష్ దేశాయ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ విగ్రహాన్ని పూణేకు చెందిన శిల్పి దీపక్ తోపటే చెక్కారు.