ఆ దూడకు పూజలు చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా, ఈ దూడకు రెండు నాసికా రంధ్రాలకు బదులు నాలుగు నాసికా రంధ్రాలు ఉన్నట్టు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందగావ్ జిల్లాలో వింత దూడ జన్మించింది.
వివరాల్లోకి వెళితే.., ఈ లేగదూడ నీరజ్ అనే వ్యక్తికి చెందింది. ఈ దూడ మకరసంక్రాంతి రోజున జన్మించిందని వెల్లడించారు. మొదట నుదుటి మధ్యలో ఉన్న కన్నును చూసి అక్కడేదో గాయం అయిందని అనుకున్నామని, టార్చ్‌లైట్ వెలుగులో పరిశీలనగా చూస్తే అది కన్ను అని అర్థమైందని వివరించారు.