పాకిస్థాన్ ముర్దాబాద్ అనండి.. చికెన్ లెగ్ పీస్‌‌లో డిస్కౌంట్ పొందండి..

శనివారం, 23 ఫిబ్రవరి 2019 (11:02 IST)
ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్ పూర్లో బండి మీద ఆహారం అమ్మే వ్యక్తి తన వద్దకు వచ్చిన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పాకిస్థాన్ ముర్దాబాద్ అని గట్టిగా అరిచిన వారికి చికెన్ లెగ్ పీస్ మీద పది రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. తన ఆఫర్ అందరికీ తెలిసేలా ఓ బ్యానర్ కూడా ప్రింట్ చేయించి.. దాన్ని బండికి కట్టాడు. పాకిస్థాన్‌కు కనీస మానవత్వం లేదు. అందుకే ప్రజల హృదయాల్లో పాక్ మీద ఉన్న ద్వేషభావం ఇలా బయటకు వస్తుందని చెప్పాడు. 
 
పుల్వామా ఎటాక్ తర్వాత దేశ ప్రజల్లో భావోద్వేగం పెరిగింది. ఉగ్రదాడితో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న పాకిస్థాన్‌పై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని పలు రెస్టారెంట్లు పాకిస్థాన్‌ను తిట్టేవారికి ఆఫర్లు ఇస్తూ వస్తోంది. అలాగే నవీ ముంబైలోని ఖర్గర్ అనే ప్రాంతంలో ఓ రెస్టారెంట్ కూడా ఇలా పాకిస్థాన్ ముర్దాబాద్ అని నినాదాలు చేసే వారికి ఫుడ్ బిల్లులో 10శాతం డిస్కౌంట్ ఇస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు