శత్రువులు దాడి చేసినప్పుడు యువకులు, విద్యార్థులు స్వీయ రక్షణతో పాటు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని కేంద్రం సూచించింది. పహల్గామ్ దాడికి తర్వాత పాకిస్థాన్ కవ్వింపు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే అవకాశాలున్నందున ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్‌తో పాటు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు కేంద్రం మాక్ డ్రిల్ సూచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇందుకు తోడు ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని.. సైరన్ ద్వారా వారిని ఎలా అప్రమత్తం చేయాలని అంశాలపై మాక్ డ్రిక్ ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత కాశ్మీర్‌లో సివిల్ డిఫెన్స్ డ్రిల్స్‌ను ఊహించారు, ఇవి ఉగ్రవాద దాడులకు సన్నద్ధతను పెంచడానికి ఉపయోగపడతాయి.