నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ.. జస్టిస్ ఎన్వీ రమణ

శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (18:41 IST)
ఈ దేశంలో నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ, దర్యాప్తు సంస్థలు మాత్రం శాశ్వతమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలు అనే అంశంపై ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. అన్ని దర్యాప్తు సంస్థల పర్యవేక్షణకు స్వతంత్ర వ్యవస్థ రావాలన్నారు. ప్రాసిక్యూషన్, దర్యాప్తు కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి యేటా దర్యాప్తు సంస్థల పనితీరును మదింపు చేయాలని ఆయన  వివరిచారు. 
 
విశ్వసనీయతలో జాతీయ సంస్థ కంటే రాష్ట్రాల పోలీసులు బాగా వెనుకబడుతున్నారని చెప్పారు. రాష్ట్ర, జాతీయ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు. అదేసమయంలో ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలు కూడా మెరుగుపరచాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ముఖ్యంగా, స్వతంత్రతతో కూడిన దర్యాప్తు సంస్థల ఏర్పాటు అత్యవసరం అని అన్నారు. నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ దర్యాప్తు సంస్థలే శాశ్వతం అని ఆయన ఉద్ఘాటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు