కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ తండ్రి మృతి

ఆదివారం, 25 ఆగస్టు 2019 (17:55 IST)
కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ తండ్రి గంగయ్యా హెగ్డే కన్నుమూశారు. గత కొంతకాలంగా కోమాలో ఉన్న ఆయన ఆదివారం ప్రాణాలు విడిచారు. 96 ఏళ్ల గంగయ్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. 
 
తనయుడు వీజీ సిద్థార్థ బలవన్మరణానికి పాల్పడక ముందునుంచే ఆయన కోమాలో ఉన్నారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా గంగయ్యకి తెలియదు. సిద్థార్థ ఆత్మహత్యకు ముందు తండ్రిని చూసి వెళ్లారు. కొన్నిరోజుల వ్యవధిలోనే కుమారుడు, తండ్రి మరణించడంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు