కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు కరోనా

బుధవారం, 10 ఆగస్టు 2022 (07:04 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు మరోమారు కరోనా వైరస్ సోకింది. తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా ట్విట్టిర్ వేదికగా వెల్లడించారు. అలాగే తనతో కాంటాక్టు అయిన వారంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు, ఖర్గే మంగళవారం రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలోనూ ఖర్గే ప్రసంగించారు. 
 
వెంకయ్యనాయుడు సభలో ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్‌ ఓం బిర్లాతో పలువురు ఎంపీలు, ప్రముఖులు హాజరై వెంకయ్యనాయుడు సేవల్ని కొనియాడారు. అయితే, నిన్న సభలో పాల్గొని ప్రసంగించిన ఖర్గేకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది.
 
ఈ ఏడాది జనవరిలోనూ ఖర్గే కరోనా బారిన పడ్డారు. లక్షణాలేమీ కనిపించికపోయినప్పటికీ కొవిడ్‌ సోకినట్టు తేలడంతో ఆయన హోంఐసోలేషన్‌లోనే ఉండి అప్పట్లో కోలుకున్నారు. ఇపుడు మరోమారు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు