కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపైదాడి

సోమవారం, 15 నవంబరు 2021 (22:09 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి జరిగింది. సోమవారంనాడు కొందరు ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. కిటికీ అద్దాలు పగులగొట్టి, తలుపులకు నిప్పుపెట్టారు.
 
సల్మాన్ ఖుర్షీద్ ఇటీవల తన పుస్తకం ''సన్ రైజ్ ఓవర్ అయోధ్య-నేషన్‌వుడ్ ఇన్ అవర్ టైమ్స్''లో హిందుత్వను ర్యాడికల్ ఇస్లాంతో పోల్చడం వివాదమైంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
కాగా, దుండగలు తన ఇంటిపై దాడి జరిపిన ఫోటోలు, వీడియోలను సల్మాన్ ఖుర్షీద్ సామజిక మాధ్యమమైన 'ఫేస్‌బుక్‌'లో పోస్ట్ చేశారు. ఇదేనా హిందుత్వమంటే అని ప్రశ్నించారు. సిగ్గు అనే పదం కూడా సిగ్గుపడేలా ఈ చర్య ఉందని అన్నారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోల్లో ఒక వీడియోలో కొందరు బీజేపీ జెండా ఊపుతూ 'జై శ్రీరామ్' నినాదాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

శశిథరూర్ ఖండన..
సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి ఘటనను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఓ ట్వీట్‌లో ఖండించారు. దేశం పట్ల తనకున్న విజన్‌ను గర్వించదగిన రీతిలో అంతర్జాతీయ వేదకలపై కూడా చాటిన రాజనీతిజ్ఞుడు సల్మాన్ ఖుర్షీద్ అని, ఆయన ఇంటిపై దాడి జరపడం అమర్యాదకరమని అన్నారు. రాజకీయాల్లో పెరుగుతున్న అసహనాన్ని అధికారంలో ఉన్న వాళ్లు తప్పనిసరిగా ఖండించాలని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు