‘తగినన్ని కరోనా టెస్టులు చేయకుండా కరోనా కట్టడి అసాధ్యమని.. దీని వల్ల ఎప్పటికైనా ముప్పు తప్పదని ఆయన అన్నారు. 3T( టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్) వ్యూహంతో కరోనాను కట్టడి చేయవచ్చని.. ప్రస్తుతం కర్ణాటక, కేరళ, దక్షిణ కొరియా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.
"3T వ్యూహంతోనే కర్ణాటక ముందుకు..
కర్ణాటక రాష్ట్రం 3T వ్యూహంతోనే ముందుకు వెళ్తోంది. దేశంలో కేసులు పెరుగుతున్నా.. కర్ణాటకలో మాత్రం వైరస్ అదుపులోనే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.