కరోనా పేషెంట్ ఓవరాక్షన్.. డాక్టర్‌ఫై ఉమ్మివేశాడు.. పోలీసులకు ఫిర్యాదు

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (09:25 IST)
కరోనా బాధితులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. కరోనాపై పోరాటం చేస్తూ.. బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సుల పట్ల కరోనా రోగులు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.

తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడిపై కరోనా వైరస్‌ సోకిన ఓ వ్యక్తి ఉమ్మివేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఓ పేషెంట్‌ శనివారం అడ్మిట్ అయ్యాడు. కానీ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వైద్యులకు ఏమాత్రం సహకరించలేదు. ఇంకా వైద్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. 
 
ఈ క్రమంలోనే తన మాస్క్‌ను తీసివేసి దానిని డాక్టర్‌పై విసిరేశాడు. అంతటితో అగకుండా వైద్యునిపై ఉమ్మి వేశాడు. అలాగే ఆస్పత్రి సిబ్బందిని, ఇతర కరోనా బాధితులను రెచ్చగొట్టేలా వ్యహరించాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
 
ప్రస్తుత పరిస్థితుల్లో అతను చేసింది చాలా తీవ్రమైన నేరమని పోలీసులు తెలిపారు. కాగా, డాక్టర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన కరోనా బాధితుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యం అందిస్తున్న వైద్యులపై ఇలా ప్రవర్తించడం దారుణమని నెటిజన్లు అంటున్నారు. ిజన్లు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు