భారత్‌ను కరోనా ఇప్పట్లో వదిలేట్టు లేదు. చైనా నుంచి పుట్టుకొచ్చి, ప్రపంచ దేశాలకు అంటుకున్న కరోనా వైరస్ కారణంగా జనాలు నానా తంటాలు పడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ విధించిన తరుణలో భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.
ఇక, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5,609 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన కోరాని హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో.. మృతుల సంఖ్య 3,435కు చేరింది.
దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,359కు చేరింది. ఇందులో ప్రస్తుతం 63,624కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.. 48,735 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రిల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.