కరోనా వైరస్ లైవ్ అప్ డేట్స్.. 24 గంటల్లో 2,293 కేసులు..

శనివారం, 2 మే 2020 (11:09 IST)
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకుగాను విధించిన లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలపాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఇదివరకు విధించిన లాక్‌డౌన్‌ గడువు ఆదివారంతో ముగిసిపోనుండగా.. తాజా పొడిగింపు నేపథ్యంలో అది ఈ నెల 17వరకు అమల్లో ఉండనుంది. 
 
ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,293 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒకరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం కావడం గమనార్హం. దేశంలో కరోనాబారిన పడిన వారి సంఖ్య 37,336కు పెరిగింది. ఇక కొత్తగా 71 మందిని మహమ్మారి బలిగొనడంతో దేశంలో మృతుల సంఖ్య 1,218కి చేరింది. ఇప్పటి వరకు 9,951 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.
 
వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 11,506కు చేరింది. వీరిలో 485 మంది మృత్యువాత పడగా.. 1,879 మంది కోలుకున్నారు. ఇక తర్వాత గుజరాత్‌లో 4,721 కేసులు నమోదవ్వగా.. 236 మంది మృతిచెందారు. 735 మంది డిశ్చార్జి అయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు