కుబేర చిత్రం తర్వాత నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హోటల్ వెయిటర్ గా వున్న ఫొటోను విడుదల చేశారు. సాఫ్ట్ గా వుండి ఇడ్లీకొట్టు లో పనిచేసే ధనుష్ జీవితంలో ఏం జరిగింది.. అనే అంశంతో చిత్రం రూపొందింది.