బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్-9 సీజన్ తొలి సీజన్ గత ఆదివారం ప్రారంభమైంది. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 14) నాటి ఎపిసోడ్‌లో తొలి ఎలిమినేషన్ జరగగా, అందులో కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చింది.
ఎలిమినేషన్ అనంతరం నాగార్జున ఆమెతో ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్నలు వేశారు. 'నిజంగా జెన్యూన్‌గా ఉన్నవారు ఎవరు?' అన్న ప్రశ్నకు శ్రేష్టి సమాధానం ఇస్తూ రాము రాథోడ్, మనీశ్, హరీష్, ఆషా షైనీ పేర్లు చెప్పింది. అదేవిధంగా, "కెమెరా ముందే యాక్ట్ చేస్తున్నవాళ్లు ఎవరు?" అన్న ప్రశ్నకు రీతూ చౌదరి, తనూజ, భరణి పేర్లు వెల్లడించింది.
"ఇలాంటి షోలలో అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది" అని బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే ముందు శ్రేష్టి పేర్కొనగా, “ఇక్కడ రెండు వారాలు నటించడం సులభం.. కానీ ఆ తర్వాత అసలు రంగు బయటపడుతుంది". అంటూ మరింత స్పష్టత ఇచ్చింది.
సామాన్యులకు అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం 15 మంది హౌస్‌లోకి ప్రవేశించగా, వారిలో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ ఉన్నారు.
గత వారం నామినేషన్ ప్రక్రియలో సంజన, తనూజ సేవ్ కాగా, మిగతా ఏడుగురు నామినేషన్‌లో ఉండటంతో ఎలిమినేట్ అయ్యేది ఎవరో అన్న ఉత్కంఠ కొనసాగింది. చివరికి శ్రేష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వెళ్లడంతో ఉత్కంఠకు తెరపడింది. బిగ్ బాస్ అభిమానులకు ఇది స్వల్ప ఆశ్చర్యం కలిగించింది.