కరోనా సెకండ్ వేవ్.. మహరాష్ట్రలో కొత్త రూల్స్.. 72 గంటల ముందే..?

బుధవారం, 25 నవంబరు 2020 (10:47 IST)
దేశంలో కరోనా సెకండ్ వేవ్‌తో రాష్ట్రాలన్నీ అప్రమత్తం అయ్యాయి. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఢిల్లీలో కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో ప్రస్తుతానికి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశమే.
 
గుజరాత్‌తో పాటుగా అటు గోవాలో కూడా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికుల విషయంలో కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. కరోనా సెకండ్ వేవ్ ఉన్న రాష్ట్రాల విమానాల ద్వారా మహారాష్ట్ర చేరుకునే వ్యక్తులు 72 గంటల ముందుగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొని ఉండాలి.
 
లేదంటే విమానాశ్రయంలోనే టెస్టులు నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో నెగెటివ్ వస్తే బయటకు పంపుతారు పాజిటివ్ వస్తే హోమ్ క్వారంటైన్ లేదా కోవిడ్ సెంటర్‌కు పంపిస్తారు. రైలు ప్రయాణికులను కూడా ఇదే విధంగా చెక్ చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లపై నిషేధం విధించే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు మహా సర్కార్ పేర్కొంది.
 
దేశంలో కరోనా సెకండ్ వేవ్‌తో రాష్ట్రాలన్నీ అప్రమత్తం అయ్యాయి. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఢిల్లీలో కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో ప్రస్తుతానికి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశమే.
 
గుజరాత్‌తో పాటుగా అటు గోవాలో కూడా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికుల విషయంలో కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లపై నిషేధం విధించే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు మహా సర్కార్ పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ ఉన్న రాష్ట్రాల విమానాల ద్వారా మహారాష్ట్ర చేరుకునే వ్యక్తులు 72 గంటల ముందుగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొని ఉండాలి.
 
లేదంటే విమానాశ్రయంలోనే టెస్టులు నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో నెగెటివ్ వస్తే బయటకు పంపుతారు పాజిటివ్ వస్తే హోమ్ క్వారంటైన్ లేదా కోవిడ్ సెంటర్‌కు పంపిస్తారు. రైలు ప్రయాణికులను కూడా ఇదే విధంగా చెక్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు