గత వారం రోజులుగా ఇటలీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు విముక్తి లభించింది. మొత్తం 85 మంది విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సోకిన దేశాల్లో ఇటలీ రెండో స్థానంలో ఉండగా, ఈ వైరస్ బారినపడి 17 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ దేశంలో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తూ వచ్చిన భారతీయ విద్యార్థులకు ఇపుడు విముక్తి లభించింది.
ఈ పరిస్థితి మరింత విషమించకముందే భారత ప్రభుత్వం తమకు సాయం అందించి స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేయాలని బాధిత విద్యార్థుల్లో ఒకరైన బెంగళూరుకు చెందిన అంకిత ప్రభుత్వాన్ని అర్థించింది. ఫలితంగా ఇటలీలో చిక్కుకున్న 85 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చారు. వీరిలో 25 మంది తెలంగాణ విద్యార్థులు కాగా, 20 మంది కర్ణాటక, 17 మంది కేరళ, కర్నాటక, ఢిల్లీకి చెందిన విద్యార్థులు ఉన్నారు.