వివరాల్లోకి వెళితే.. రమేశ్ కుమార్ (40), గుణ (35)లు భార్యభర్తలు. మంగళూరు చిత్రపూర్లోని రహేజా అపార్ట్మెంట్లో నివాసిస్తున్నారు. ఇటీవల రమేశ్.. స్థానిక పోలీసు అధికారికి వాయిస్ మెసేజ్ పెట్టాడు తనకు, తన భార్యకు కరోనా సోకిందని కావున ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పారు. తమ అంత్యక్రియలు జరిపించాలని కోరారు. అయితే ఆ పోలీసుల అధికారి వారికి వెంటనే స్పందించి ఆత్మహత్యకు చేసుకోవద్దని చెప్పాడు. కానీ రమేశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.
అయితే వారు ఇంకో వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. తమ తల్లిదండ్రులను క్షేమంగా చూసుకోవాలని, తమ అంత్యక్రియలకు రూ.లక్షను ఉంచుతున్నామని అందులో చెప్పారు. అలాగే అక్కడ గుణ రాసిన ఓ సూసైడ్ లేఖ కూడా ఉంది. తన ఇంట్లో ఉన్న సామానును పేదలకు పంచాలని కోరింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో మృతదేహాలకు కోవిడ్ పరీక్ష చేయగా వారికి కోవిడ్ నెగటీవ్ అని తేలింది. కోవిడ్ వస్తే భయపడవద్దని, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.