మనుషుల ఆరో సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జంతువులు షాకై చూసేలా మనుషులు నడుచుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కరోనాకు కారణమైన చైనాలో పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో అన్ని రంగాలు తెరుచుకున్నాయి. పర్యాటక రంగం తిరిగి ప్రారంభమైంది. రాజధాని బీజింగ్‌లోని జూ వీకెండ్స్‌లో పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి.
ఆదివారం రోజున పెద్దసంఖ్యలో పర్యాటకులు బీజింగ్ జూకు తరలి వచ్చారు. అయితే, జూలో ఉన్నట్టుండి ఇద్దరు పర్యాటకుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి రెండు కుటుంబాల మధ్య గొడవలా మారిపోయింది. రెండు కుటుంబాలకు చెందిన మహిళలు జుట్టుపట్టుకొని కొట్టుకున్నారు. మహిళలు అని చూడకుండా పురుషులు మహిళలపై తిరగబడి కొట్టారు. దీంతో ఆక్కడ ఉన్న పర్యాటకులు ఏం జరుగుతుందో తెలియక నిలబడిపోయారు.
అటు జూలో ఉన్న జంతువులు కూడా ఆ కొట్లాటని ఆసక్తిగా గమనించాయని, రాత్రి సమయంలో ఉన్నట్టుండి జంతువులు కూడా కొట్లాటకు దిగాయని, మనుషుల ప్రభావం ఆ జంతువులపై కూడా కనిపించిందని జూ నిర్వాహకులు పేర్కొన్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.