కరోనా వైరస్ విజృంభించక ముందు దేశంలో పురుషుల జీవిత కాలం 69.2 ఏళ్లు కాగా, ఆడవారి జీవితకాలం 72 ఏళ్లుగా ఉంది. 2020లో కరోనా విజృంభణతో 35 నుంచి 79 ఏళ్ల వయస్సున్న వారిలో ఎక్కువ మరణాలు నమోదు అయ్యాయి. దీని కారణంగానే జీవితకాలం తగ్గినట్లు తెలుస్తోందని ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ తెలిపారు.
దీంతో పురుషుల్లో 67.5 ఏళ్లు, మహిళల్లో 69.8 ఏళ్లకు జీవితకాలం చేరినట్లు రిపోర్ట్‌లో తెలిపారు. 145 దేశాల గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్, కోవిడ్ ఇండియా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్ పోర్టల్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఐఐపీఎస్ తన నివేదికను తయారు చేసింది.